క్రీడాకారులకు సహకారం అందిస్తాను - కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వెల్లడి

 క్రీడాకారులకు సహకారం అందిస్తాను 

- త్వరలో మినీ స్టేడియం కు మహర్దశ 

- శారీరక, మానసిక వికాసానికి క్రీడలు అవసరం

- కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి వెల్లడి 


క్రీడాకారులకు తన వంతు సహకారం అందిస్తానని, యువత క్రీడల వైపు ఆసక్తి చూపాలని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. కావలి పట్టణంలోని మినీ స్టేడియంలో కావలి స్పోర్ట్స్ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కావలి నియోజకవర్గ మరియు జలదంకి మండల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను ఆయన ప్రారంభించారు. స్టేడియంకు విచ్చేసిన ఆయనకు టోర్నమెంట్ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. సరదాగా కాసేపు క్రికెట్ ఆడి క్రీడాకారులను ఉత్తేజపరిచారు. టాస్ వేసి ఆటను ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ త్వరలో మినీ స్టేడియంకు మహర్దశ పట్టనుందని తెలిపారు. శాప్ అధికారులు రావడం జరిగిందని, స్టేడియంకు అవసరమైన పనుల కొరకు డిపిఆర్ లు తయారు చేయడం జరిగిందన్నారు. స్టేడియంను చదును చేయడానికి, అవసరమైన మట్టి తొలకాలకు సంబందించిన ఖర్చులు తాను భరిస్తానని అన్నారు. వాకర్స్ కు ఇబ్బందులు తలెత్తకుండా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. శారీరక, మానసిక ఉల్లాసానికి క్రీడలు అవసరమని తెలిపారు. ఎక్కడ చెమట చిందుతుందో అక్కడ విజయం దరి చేరుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కావలి పట్టణ టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పొట్లూరి శ్రీనివాసులు, మదన్ మోహన్ రెడ్డి, సిద్దు, బుర్లా శ్రీధర్ రెడ్డి, దేవరకొండ శ్రీను, ఆళ్ళ శ్రీను, విక్రమ్ రెడ్డి, మొగిలి కల్లయ్య, కుందుర్తి కిరణ్, రఫీ, దామా మాల్యాద్రి, గంగినేని వెంకటేశ్వర్లు, శానం హరి, జనిగర్ల మనోహర్, పులిమి రామిరెడ్డి, క్రీడాకారులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు..



google+

linkedin